కోవిడ్ 19: షాపింగ్ మాల్స్ పై నజర్..నిబంధనలపై అవగాహన కల్పించేందుకు వాలంటీర్ల ఏర్పాటు

- June 23, 2020 , by Maagulf
కోవిడ్ 19: షాపింగ్ మాల్స్ పై నజర్..నిబంధనలపై అవగాహన కల్పించేందుకు వాలంటీర్ల ఏర్పాటు

లాక్ డౌన్ ఆంక్షలను సడలించి..సాధారణ జనజీవనం ఏర్పడేలా ప్రయల్నాలు జరుగుతున్నా..చాలా ప్రాంతాల్లో మాత్రం ఇంకా కరోనా వైరస్ ముప్పు మాత్రం తొలిగిపోలేదు. ఓ వైపు ఆంక్షలను తొలగిస్తున్నా..వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రత్యామ్నాయ ప్రయత్నాలు చేపడుతున్నాయి ఆయా ప్రభుత్వాలు. షార్జాలో షాపింగ్ మాల్స్ కు అనుమతి ఇవ్వటంతో మళ్లీ చాలా రోజుల తర్వాత సందడి నెలకొంది. అయితే..షార్జాను కరోనా ఫ్రీ చేయాలనే నిశ్చయంతో ఉన్న స్థానిక అధికారులు..షాపింగ్ మాల్స్ ద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని మాల్స్, షాపింగ్ సెంటర్స్, ఫుడ్ కోర్టుల దగ్గర వాలంటీర్లను ఏర్పాటు చేశారు. షాప్ యాజమానులు తగిన నియంత్రణ చర్యలు తీసుకుంటున్నారా...లేదా?..మాల్స్ లో భౌతిక దూరం పాటిస్తున్నారా...లేదో వాలంటీర్లు ఎప్పటికప్పుడు ఓ కన్నేసి ఉంచుతున్నారు. అంతేకాదు..మాల్స్, ఫుడ్ కోర్టులకు వచ్చే వారికి కరోనా వైరస్ ముప్పు గురించి వివరించి..వ్యాప్తి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలు వివరిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com