నితిన్ పెళ్లి తేదీ దాదాపుగా ఖరారైనట్టే!
- June 23, 2020
నాగర్ కర్నూల్‌కు చెందిన షాలినితో నితిన్ చాలాకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఈ ప్రేమను పెళ్లి పీటలెక్కించేందుకు ఫిబ్రవరి 15న హైదరాబాద్‌లో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. ఏప్రిల్‌లో పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అన్నీ కలిసొస్తే నితిన్ ఈపాటికే ఓ ఇంటివాడయ్యేవాడు. కానీ కరోనా మహమ్మారి వల్ల అన్ని ప్లాన్‌లు రద్దయ్యాయి. దీంతో దుబాయ్‌లో ఏప్రిల్ 16న జరగాల్సిన పెళ్లి కాస్తా వాయిదా పెడింది. అయితే వచ్చే నెలలోనే నితిన్ వివాహానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
తొలుత డిసెంబర్‌లో పెళ్లి జరగనుందని వార్తలు వచ్చినప్పటికీ తాజా సమాచారం ప్రకారం జూలైలోనే వివాహం జరగనుందని తెలుస్తోంది. ఇప్పట్లో కరోనా సమస్య ముగిసే సూచనలు లేకపోవడంతో పెళ్లి పనులు కూడా మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. కానీ ఈ సారి ప్లాన్‌ను విదేశాల నుంచి హైదరాబాద్‌కు మార్చారు. నగర శివారులోని ఓ ఫామ్ హౌస్‌లో నితిన్ వివాహం జరగనుందని టాక్. ఇక ఈ విషయాన్ని నితిన్, షాలినీ కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు