కువైట్ : కరోనాతో మరణించిన సెంట్రల్ జైలు ఖైదీ
- June 23, 2020
కువైట్ లోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్న మహిళా ఖైదీ కరోనాతో చనిపోయినట్లు అంతర్గత మంత్రిత్వ శాఖలోని భద్రత పరిపాలన విభాగం అధికారులు వెల్లడించారు. 59 ఏళ్ల మహిళా ఖైదీకి కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావటంతో...ఈ నెల 15న ఆమెను ఆస్పత్రిలో చేర్పించామన్నారు. అల్ ఫర్వానియా ఆస్పత్రిలో వారం పాటు చికిత్స అందించిన తర్వాత ఆమె శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదుర్కొని మరణించినట్లు వెల్లడించారు. అయితే..ఆమెకు ఇతర రోగాలు కూడా ఉండటంతో కరోనా నుంచి కోలుకోలేకపోయినట్లు చెబుతున్నారు. మహిళా ఖైదీ కరోనా బారిన పడటంతో జైలులో తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని, ఇతర ఖైదీలకు వైరస్ వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టామని వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!
- భద్రతా రంగంలో ఒమన్-బహ్రెయిన్ మధ్య ద్వైపాక్షిక సహకారం..!!
- బహ్రెయిన్ ఓపెన్ జైలులో ఒమన్ ఇంటీరియర్ మినిస్టర్..!!
- ప్రయాణికులకు షార్జా ఎయిర్ పోర్ట్ గుడ్ న్యూస్..!!
- ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పై టీటీడీ అదనపు EO సమీక్ష
- రెనోలో NATS, ఐఏసీసీఎన్ఎన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా దీపావళి వేడుకలు
- సత్యసాయి శతజయంతి వేడుకలకు మోదీ–ముర్ము హాజరు







