షార్జా: 25 వ అంతస్తు నుండి కిందపడి మరణించిన భారతీయ వ్యాపారవేత్త
- June 23, 2020
షార్జా: 25వ అంతస్థు నుండి కిందపడి ప్రాణాలు కోల్పోయిన భారత వ్యాపారి..వివరాల్లోకి వెళ్ళితే..దుబాయ్‌లో నివిసిస్తున్న టి.పి. అజిత్(55) జమాల్ అబ్దుల్ నాజర్ వీధిలోని టవర్ 25 వ అంతస్తు నుండి కిందపడి మరణించారు. ఇది ఆత్మహత్య లేక హత్య అనేది దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
దుబాయ్ లో నివాసముంటున్న అతను షార్జాకు ఎందుకు ప్రయాణించాడో స్పష్టంగా తెలియదని కమ్యూనిటీ వర్గాలు తెలిపాయి. మృతుడు దుబాయ్ నివాసి కావడంతో ఈ కేసును దర్యాప్తు చేయడానికి షార్జా మరియు దుబాయ్ పోలీసులు కలిసి పనిచేయవలసి ఉంటుందని అధికారి తెలిపారు.
30 సంవత్సరాలపాటు యూఏఈ లో నివసిస్తున్న అజిత్ కు గోడౌన్, లాజిస్టిక్స్, కోల్డ్ స్టోరేజ్ వంటి పలు వ్యాపారాలు ఉన్నాయి. అతనికి ఇతర గల్ఫ్ దేశాలలో వ్యాపార ఉనికి ఉంది. ఆయన ఇటీవల కేరళలోని కన్నూర్‌లో ఒక ఇల్లు నిర్మించారు. ఆయనకు భార్య బిందు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమారుడు వ్యాపారం నడుపుటకు అజిత్ కు సహాయం అందిస్తుండగా కుమార్తె విద్యనభ్యసిస్తున్నట్టు తెలుస్తోంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు