దోహా:రెసిడెన్షియల్ ప్రాంతాల్లోని కార్మికుల నివాస వసతుల తనిఖీ..ఉల్లంఘనులకు వార్నింగ్

- June 23, 2020 , by Maagulf
దోహా:రెసిడెన్షియల్ ప్రాంతాల్లోని కార్మికుల నివాస వసతుల తనిఖీ..ఉల్లంఘనులకు వార్నింగ్

దోహా:ఖతార్ లోని నివాస ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వలస కార్మికుల అకామిడేషన్ గదులను కార్మిక, మంత్రిత్వ శాఖ పరిశీలించింది. అంతర్గత మంత్రిత్వ శాఖ, మున్సిపాలిటి, పర్యావరణ మంత్రిత్వ శాఖతో సమన్వయంతో కార్మిక శాఖ ఈ తనిఖీలను చేపట్టింది. కరోనా నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య సంరక్షణకు ఖతార్ కార్మిక, సాంఘిక మంత్రిత్వ శాఖ గతంలో నిర్ధిష్టమైన మార్గదర్శకాలను జారీ చేసిన విషయం తెలిసిందే. గదుల్లో కార్మికులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవటంతో పాటు..ఒక్కో గదిలో ఐదుగురికి మించి ఉండకూడదని గతంలోనే సూచించింది. అయితే..తమ ఆదేశాలను సరిగ్గా అమలు చేస్తున్నారా? లేదా? పరిశీలించేందుకు విడతల వారీగా తనిఖీలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఏప్రిల్ 20 నుంచి జూన్ 21 మధ్య 1,245 నివాస గదులను పరిశీలించారు. పరిమితికి మించి ఎక్కువ మంది కార్మికులు ఉంటే వారిని అక్కడి ఖాళీ చేయించారు. అలాగే  నిబంధనలు పాటించని వారికి 4,616 టెక్ట్స్ మెసేజ్ లను పంపించారు. ఏయే నిబంధనలు ఉల్లంఘించారో నోట్ చేస్తూ..వారం రోజుల్లో సరిదిద్దుకోవాలంటూ హెచ్చరించారు. నివాసానికి అనువుగా లేకుంటే బ్యాన్ లిస్టులో చేరుస్తామని వార్నింగ్ ఇచ్చారు.
అయితే..రెండో దశలో వివిధ కంపెనీలు తమ కార్మికులకు కల్పించిన వసతి సౌకర్యాలను మెరుగు పర్చుకున్నట్లు మంత్రిత్వ శాఖ అధికారులు వెల్లడించారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com