పబ్లిక్‌ మోరల్స్‌ ఉల్లంఘన: పలువురి అరెస్ట్‌

- June 23, 2020 , by Maagulf
పబ్లిక్‌ మోరల్స్‌ ఉల్లంఘన: పలువురి అరెస్ట్‌

కువైట్ సిటీ:పబ్లిక్‌ మోరల్స్‌ని ఉల్లంఘించిన దరిమిలా పలువురు వ్యక్తుల్ని సెక్యూరిటీ అథారిటీస్‌ అరెస్ట్‌ చేసినట్లు మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌ వెల్లడించారు. అల్‌ అహ్మద్‌ మెరైన్‌ ప్రాంతంలో ఈ అరెస్టులు జరిగాయి. పలు ఫిర్యాదుల మేరకు మినా అబ్దుల్లా, జులైయా, బనైదర్‌, అల్‌ జౌర్‌, ఖైరాన్‌ మరియు మెరైన్‌ సిటీ సబా అల్‌ అహ్మద్‌ ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అథారిటీస్‌ తనిఖీలు నిర్వహిస్తున్నాయి. బీచ్‌లు, ఛాలెట్స్‌ ప్రాంతాల్లో ఈ ఉల్లంఘనలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉల్లంఘనలకు పాల్పడినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అథారిటీస్‌ పేర్కొన్నాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com