దుబాయ్:నిషేధిత డ్రగ్స్ ను ప్రమోట్ చేస్తున్న 10 సోషల్ మీడియా అకౌంట్ల గుర్తింపు
- June 23, 2020
దుబాయ్:నిషేధిత డ్రగ్స్ అమ్మకాలపై దుబాయ్ పోలీస్ ఉక్కుపాదం మోపుతోంది. సోషల్ మీడియా వేదికగా డ్రగ్స్ ను అమ్ముతున్న 10 ఖాతాలను దుబాయ్ పోలీసులు గుర్తించారు. ప్రజాదరణ పొందిన ప్రముఖ సామాజిక మాద్యమాలు ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ ను వేదికగా చేసుకొని డ్రగ్స్ ప్రమోట్ చేస్తున్నట్లు తాము నిర్ధారించుకున్నామని దుబాయ్ పోలీసులు వెల్లడించారు. ఇన్ స్టాగ్రామ్ వేదికగా డ్రగ్స్ అమ్ముతున్న వ్యక్తి ఖాతాలో 16 వందల మంది ఫాలోవర్లు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. డ్రగ్స్ అమ్మకాలకు సంబంధించి వీడియోలను కూడా పోస్ట్ చేసినట్లు చెప్పారు. అయితే..తమ చేతికి చిక్కకుండా అతను చాలా జాగ్రత్తగా వ్యవహరించినప్పటికీ..వలపన్ని అతన్ని పట్టుకున్నామని పోలీసులు వివరించారు. అలాగే ఆసియా దేశాలకు చెందిన మరో వ్యక్తి స్నాప్ చాట్ వేదికగా డ్రగ్స్ అమ్ముతున్నాడన్నారు. ఆన్ లైన్ లో డబ్బులు పంపిస్తే..డ్రగ్స్ సరఫరా చేస్తామని కస్టమర్లకు చెబుతున్నాడని, అయితే..తాము అకౌంట్ ట్రేస్ చేసి వివరాలు రాబట్టిన తర్వాత అతను విదేశాల్లో ఉంటున్నట్లు గుర్తించామన్నారు. ఏదిఏమైనా డ్రగ్స్ కు సంబంధించిన కేసుల్లో తాము ఎక్కువగా ఫోకస్ చేస్తామని, కఠిన చర్యలు తీసుకుంటామని దుబాయ్ పోలీసులు హెచ్చరించారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లల ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాలని సూచించారు.సోషల్ మీడియా అకౌంట్ల పై గట్టి నిఘా ఉందని దుబాయ్ పోలీస్ కమాండర్ ఇన్ చీఫ్ అబ్దుల్లా ఖలీఫా అల్ మర్రి తెలిపారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు