నాలుగో షిప్పింగ్ లైన్‌ని ప్రారంభించిన సౌదీ పోర్ట్స్ అథారిటీ
- June 24, 2020
జెడ్డా: సౌదీ పోర్ట్స్ అథారిటీ (మవాని), ఫస్ట్ డైరెక్ట్ షిప్పింగ్ లైన్ కనెక్షన్ - యూఏఈ జబెల్ అలి పోర్ట్ - ఈజిప్ట్ షోక్నా పోర్ట్ (జెడ్డా ఇస్లామిక్ పోర్ట్ ద్వారా) లైన్‌ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. డిపి వరల్డ్ భాగస్వామ్యంతో ఈ ప్రాజెక్ట్ చేపట్టబడింది. 2020లో మవాని ద్వారా ప్రారంభించబడిన నాలుగో షిప్పింగ్ లైన్ ఇది. సౌదీ పోర్ట్స్ని రీజినల్ అలాగే గ్లోబల్ కౌంటర్‌పార్ట్స్‌తో అనుసందానించే క్రమంలో ఈ కొత్త లైన్స్ ఉపయోగపడ్తాయని మవానీ చెబుతోంది. ఈ ఒప్పందం ప్రకారం డిపి వరల్డ్, జెడ్డా ఇస్లామిక్ పోర్ట్‌ని అప్‌గ్రేడ్ చేస్తుంది. మవాని ప్రెసిడెంట్ సాబ్ అల్ ఖాల్బ్ మాట్లాడుతూ, ఈ విభాగంలో మరిన్ని అద్భుతమైన ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు. ఈ షిప్పింగ్లైన్తో అరబ్ సమాజానికి ఎంతో మేలు కలుగుతుందని డిపి వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ మరియు సీఈఓ సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయెమ్ చెప్పారు.
తాజా వార్తలు
- ముగ్గురు ఆసియన్లపై బహ్రెయిన్ లో విచారణ ప్రారంభం..!!
- సీజింగ్ వాహనాలు వేలం..సౌమ్ అప్లికేషన్ ద్వారా బిడ్డింగ్..!!
- ఒమన్ లో ఆరుగురు అరబ్ జాతీయులు అరెస్టు..!!
- జెడ్డా ఆకాశంలో నిప్పులుగక్కిన ఫైటర్ జెట్స్..!!
- కువైట్ లో ట్రాఫిక్ చట్టాలపై అవగాహన..!!
- ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపులు..188 మంది అరెస్టు..!!
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!