బహ్రెయిన్:కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ లోనే స్కూల్ పరీక్షా ఫలితాలు

- June 24, 2020 , by Maagulf
బహ్రెయిన్:కరోనా నేపథ్యంలో ఆన్ లైన్ లోనే స్కూల్ పరీక్షా ఫలితాలు

మనామా:కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షా ఫలితాలను పేపర్ లెస్ గా విడుదల చేయాలని నిర్ణయించింది విద్యాశాఖ. దీంతో ఈ ఏడాది స్కూల్ పరీక్షా ఫలితాలు అన్ని ఆన్ లైన్ లోనే విడుదల కానున్నాయి. ఒక్కసారి అధికారక ధృవీకరణ తర్వాత ఫలితాలను డిజిటల్ వేదికగా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. పేపర్లు, సర్టిఫికెట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు మెండుగా ఉండటం, అంతేకాకుండా భైతిక దూరం అమలుకు కూడా విఘాతం కలిగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. విద్యాశాఖకు సంబంధించిన పోర్టల్ edunet.bh లో విద్యార్ధుల పరీక్ష ఫలితాలను చెక్ చేసుకోవచ్చునని వెల్లడించారు. థార్డ్ ఇంటర్మిడియెట్, సెకండరీ స్కూల్ స్టూడెంట్స్ కూడా microsoft365 అకౌంట్స్ ద్వారా సర్టిఫికెట్లను పొందవచ్చని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే గ్రాడ్యూయేషన్, గుడ్ కండక్ట్ సర్టిఫికెట్ కూడా ఈ మెయిల్ ద్వారా అందించనున్నట్లు ప్రకటించారు. ఎవరైనా విద్యార్ధులు సాంకేతిక కారణాలతో సర్టిఫికెట్లను, పరీక్ష ఫలితానలు పొందలేకపోతే..17-278777కు ఆఫీసు సమయాల్లో ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. అలాగే microsoft365 సంబంధించి ఎవైనా సమస్యలు ఉంటే..yalla365.net/yalla-formకు లేదంటే [email protected] ద్వారా నివృత్తి చేసుకోవచ్చని కూడా విద్యాశాఖ వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com