ఏపీలో మరో 477 కరోనా పాజిటివ్‌ కేసులు

- June 25, 2020 , by Maagulf
ఏపీలో మరో 477 కరోనా పాజిటివ్‌ కేసులు

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 477 కొత్త కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 19,085 శాంపిల్స్‌ని పరీక్షించగా 477 మంది కోవిడ్-19 పాజిటివ్‌గా తేలారు. 118 మంది డిశ్చార్జ్ అయ్యారు.కోవిడ్‌ కారణంగా గడిచిన 24 గంటల్లో 7 మంది మృతి చెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. కర్నూలు జిల్లాలో ఇద్దరు, కృష్ణా జిల్లాలో ఇద్దరు, గుంటూరులో ఇద్దరు, తూర్పు గోదావరి జిల్లాలో మరొకరు మరణించారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com