అమెరికా:తొమ్మిది రాష్ట్రాల్లో రాకపోకలు బంద్..
- June 25, 2020
అమెరికా:ఇప్పుడిప్పుడే అగ్రరాజ్యం అమెరికా కరోనా మహమ్మారి నుంచి కోలుకుంటోంది. ఈ సమయంలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాకపోకలు సాగిస్తే మరింత ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని, దాన్ని నివారించాలంటే రాకపోకలు నిరోధించడం ఒక్కటే మార్గమని తలుస్తున్నాయి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు. అమెరికా రాష్ట్రాలు న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ రాష్ట్రాల గవర్నర్ లు తమ ప్రజలను ఆదేశించారు. నార్త్ కరినా, సౌత్ కరోలినా, అలబామా, ఆర్కన్సాస్, ఫ్లోరిడా, వాషింగ్టన్, టెక్సాస్ రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి.
కరోనా తీవ్రత ఆయా రాష్ట్రాలో ఎక్కువగా ఉన్నందున ఈ నిర్ణయం తీసుకున్నాయి ప్రభుత్వాలు. నిన్న మొన్నటి వరకు న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాల్లో వేల సంఖ్యలో మరణాలు సంభవించాయి. పరిస్థితులు కాస్త కుదుట పడుతున్న సమయంలో మళ్లీ రిస్క్ తీసుకోవద్దని భావిస్తున్నాయి. భారత కాల మానం ప్రకారం గురువారం సాయింత్రం నుంచి ఆదేశాలు అమల్లోకి వస్తాయి. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి ఉంటే 14 రోజులు క్వారంటైన్ లో ఉండాలని ముందుగానే హెచ్చరించారు. క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించినట్లైతే వెయ్యి డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?