మృతిచెందిన ప్రవాసికి ఘనమైన నివాళి.. ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్

- June 27, 2020 , by Maagulf
మృతిచెందిన ప్రవాసికి ఘనమైన నివాళి.. ప్రత్యేక చార్టెడ్ ఫ్లైట్

యూ.ఏ.ఈ:దుబాయ్‌లో మెకానిక‌ల్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్న తిన్ చంద్రన్(28) అనే భార‌త ప్ర‌వాసి జూన్ 8న‌ గుండెపోటుతో మ‌ర‌ణించిన విష‌యం తెలిసిందే.

జూన్ 8న దుబాయ్ లో అకాల మరణం చెందిన మలయాళీ వాసి నితిన్ చంద్రన్ జ్ఞాపకార్థం ఒక భారతీయ సంఘం గురువారం షార్జా నుండి కేరళకు చార్డర్డ్ ప్లైట్ ఏర్పాటు చేసింది. మొత్తం 215 మంది ప్రయాణికులను ప్రత్యేక ఎయిర్ అరేబియా విమానంలో గురువారం రాత్రి 11.30 గంటలకు కోజికోడ్ కు పంపించారు.

లాక్డౌన్ సడలింపుల అనంతరం గర్భంతో ఉన్న భార్యను స్వదేశానికి పంపించారు నితిన్ చంద్రన్. అనంతరం దుబాయ్ లోనే ఉన్న నితిన్ చంద్రన్ నిద్రలోనే గుండెపోటుతో కన్నుమూశారు. ఆయన మరణించిన తరువాత రోజే భార్య అతిర గీతా శ్రీధరన్.. చిన్నారికి జన్మనిచ్చింది.

ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాల పట్ల మక్కువ, అంకిత భావంతో పాటు సామాజిక కార్యకర్త కూడా అయిన నితిన్ చంద్రన్ మరణం యూ.ఏ.ఈలోని భారతీయ సమాజం వారిని షాక్ కి గురి చేసింది. ఆయనకు నివాళి అర్పించే దిశగా నితిన్ స్వస్థలమైన కోజిక్కోడుకు విమానం చార్టర్ చేయాలని నిర్ణయించుకున్నాము అని RAK ఇండియన్ అసోసియేషన్ అధ్యక్షుడు SA సలీమ్ అన్నారు. 30 మంది గర్భిణీ స్త్రీలు ఉన్న ఈ ఫ్లైట్ లో ప్రయాణించిన వారికి ఉచితంగా టికెట్లు అందించినట్లు చెప్పారు. నితిన్ చంద్రన్ చిత్రాలతో వారందరికి ప్రత్యేక బోర్డింగ్ పాస్ తో పాటు ఉచితంగా పీపీఈ కిట్లు అందించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com