ప్రపంచవ్యాప్తంగా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు

- June 27, 2020 , by Maagulf
ప్రపంచవ్యాప్తంగా భారత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలు

హైదరాబాద్:ప్రపంచవ్యాప్తంగా భారత మాజీ ప్రధాని తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు శత జయంతి ఉత్సవాలని నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం.ఈ కార్యక్రమంలో భాగంగా నిన్న మంత్రి కేటీఆర్,ఉత్సవ కమిటీ సభ్యులు టీఆరెస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగల తో కలిసి దాదాపు 51 దేశల్లో నివసిస్తున్న తెలుగు వారితో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ  పీవీ అవలంబించిన వివిధ విప్లవాత్మక సంస్కరణల నిర్ణయాలతో మన దేశాన్ని అభివృద్ధి వైపు నడిపాయి అని గుర్తు చేశారు. అలాగే అన్ని దేశాల లో  సంవత్సరం పాటు పీవీ జయంతి ఉత్సవలను నిర్వహించాలని దశ నిర్దేశం చేశారు. అలాగే ఏదైనా దేశాలల్లో అక్కడి ప్రభుత్వం అనుమతి ఇస్తే పీవీ విగ్రహాలు కూడా తెలంగాణ ప్రభుత్వం తరపున ఏర్పాటు చేస్తామని కేటీఆర్ చెప్పారు.ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ సభ్యులు గా మహేష్ బిగల ని నియమించినందుకు అన్ని వివిధ దేశాల ప్రతినిధులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ,ఎమ్మెల్యే రమేష్ బాబు ,ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి మరియు వివిధ దేశాల నుండి దాదాపు ఐదు వందలకు పైగా తెలుగు ఎన్నారైలు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com