బహ్రెయిన్:డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇద్దరు గల్ఫ్ పౌరులకు జీవితఖైదు

- June 27, 2020 , by Maagulf
బహ్రెయిన్:డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఇద్దరు గల్ఫ్ పౌరులకు జీవితఖైదు

బహ్రెయిన్:డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ఇద్దరు గల్ఫ్ జాతీయులకు నాల్గో ఉన్నత క్రిమినల్ కోర్టు జీవితఖైదు విధించింది. అలాగే  BD10,000 జరిమానా విధించింది. బహ్రెయిన్ కు చెందిన దోషులు ఇద్దరు డ్రగ్స్(హషిష్, మరిజునా) అక్రమ రవాణా, అమ్మకం, పంపిణీ చేస్తున్నట్లు న్యాయస్థానంలో రుజువు కావటంతో న్యాయస్థానం జీవితఖైదు ఖరారు చేసింది. ఇదే కేసులో మిగిలిన ముఠా సభ్యులకు మూడేళ్ల జైలు శిక్ష  BD1,000 జరిమానా విధించింది. అయితే..అంతర్గత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మాదకద్రవ్యాల నిరోధక విభాగంలోని అధికారులు పకడ్బందీ స్కెచ్ తో డ్రగ్స్ ముఠాను ఆటకట్టించారు. గతేడాది రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయిన డ్రగ్స్ స్మగ్లర్ ద్వారా..ప్రస్తుత మాదకద్రవ్యాల అమ్మకాల గురించి అందిన పక్కా సమాచారంతో వల పన్నారు. BD3,900 విలువైన డ్రగ్స్ ను డీల్ చేసేందుకు వచ్చిన బహ్రెయిన్ వ్యక్తిని తొలుత అరెస్ట్ చేశారు. అతన్ని విచారిస్తున్న సమయంలో స్నాప్ చాట్ ద్వారా కాల్ చేసిన మరో స్మగ్లర్ తొలుత పట్టుబడిన వ్యక్తితో కిలోగ్రామ్ హషిష్ కు సంబంధించి మాట్లాడుతుండగానే పోలీసులు అతన్ని కూడా ట్రాప్ లోకి లాగారు. మరో వ్యక్తికి డ్రగ్స్ కావాలని అతను ఫోన్ లోనే చెప్పాడు. దీంతో వలపన్నిన పోలీసులు రెండో వ్యక్తిని రప్పించి అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇలా ముల్లును ముల్లుతోనే తీయాలన్నట్లుగా స్మగ్లర్ల గుట్టును వారి ద్వారానే రాబట్టి ముఠా సభ్యులందర్నిఅరెస్ట్ చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com