దోహా:జులై 26లోపు జాతీయ చిరునామా నమోదు చేసుకోవాల్సిందే..లేదంటే జరిమానా
- June 27, 2020
దోహా:దేశంలోని ప్రతి పౌరుడు, ప్రవాసీయులు ఖచ్చితంగా జాతీయ చిరుమానా వివరాలను నమోదు చేసుకోవాల్సిందేనని ఖతార్ ప్రభుత్వం పిలుపునిచ్చింది. జులై 26తో గడువు ముగుస్తుంది కనుక ఆలోగానే చిరునామా నమోదు చేసుకోవాలని అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. జాతీయ చిరునామా నమోదు చేసుకున్నవారికే ఇతర సేవలు అందుబాటులోకి వస్తాయని కూడా హెచ్చరించింది. ఈ ఏడాది జనవరి 27 నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియలో ఇప్పటివరకు దాదాపు 10 లక్షల మంది తమ చిరుమానా వివరాలను నమోదు చేసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చిరునామా నమోదులో...ఖతార్ లో వారు ఏ చిరునామాలో ఉంటున్నారు, ల్యాండ్ లైన్ ఫోన్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్, ఈ-మెయిల్ అడ్రస్, అలాగే వారు పని చేసే ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల చిరునామాకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తమ దరఖాస్తులో ప్రభుత్వానికి అందించాల్సి ఉంటుంది. అంతేకాదు..జాతీయ చిరునామా నమోదులో ఇచ్చే ప్రతి సమాచారానికి దరఖాస్తుదారుడే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చినట్లు నిరూపణ అయితే QR10,000 జరిమానా విధిస్తారు. అలాగే జులై 26లోగా తమ చిరునామా వివరాలను నమోదు చేసుకోకుంటే QR5,000 జరిమానా విధిస్తారు. ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునేవారు అంతర్గత మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ మెట్రాష్2లో కూడా చిరునామా నమోదు చేసుకోవచ్చు. అలాగే ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటి, పర్యావరణ మంత్రిత్వ శాఖ కార్యాలయాలు, మినిస్ట్రి ఆఫ్ జస్టిస్, సుప్రీం జ్యూడిషియరి కౌన్సిల్, ప్రణాళిక కార్యాలయాల్లో చిరునామాను నమోదు చేసుకోవచ్చు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!