భోజనం చేసిన తర్వాత నియమాలు ఎందుకు ?
- February 02, 2016
భోజనం చేసిన తర్వాత ఏం చేయాలి ? ఏం చేయకూడదు ? అనే ప్రశ్నలు అందరినీ వేధిస్తుంటాయి. అయితే ఒక్కొక్కరు ఒక్కొక్కటి చెబుతూ మరింత డైలమాలో పడేస్తుంటారు. కొందరేమో అన్నం తిన్న వెంటనే పడుకుంటే లావైపోతారు అంటారు.. మరికొందరేమో తిన్న వెంటనే ఎక్కువ నీళ్లు తాగకూడదు అంటారు. అసలు భోజనం చేసిన తర్వాత నియమాలు ఎందుకు ? అంటే.. తిన్న ఆహారం సరైన క్రమంలో జీర్ణమైతే ఎలాంటి సమస్యా ఉండదు. భోజనం తర్వాత చేసే కొన్ని పనుల వల్ల జీర్ణక్రియ సరిగా జరగక అనవసర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబట్టి భోజనం తర్వాత ఏ పనులు చేయకూడదో ఓ అవగాహనకు వస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి భోజనం తర్వాత చేయకూడని ఆరు ముఖ్యమైన పనులున్నాయి. అవేంటో చూడండి.. పొగత్రాగరాదు చాలామందికి స్మోకింగ్ అలవాటు ఉంటుంది. అయితే భోజనం తర్వాత స్మోకింగ్ అలవాటు అస్సలు మంచిది కాదు. కాబట్టి భోజనం తర్వాత సిగరెట్ తాగితే 10 సిగరెట్స్ తాగినట్టు. దీనివల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పళ్లు తినకూడదు భోజనం తర్వాత పండ్లు తినడం చాలా పాటిస్తుంటారు. అయితే ఆహారం తిన్న తర్వాత వెంటనే పండ్లు తినకూడదు. దీనివల్ల కడుపులో గాలి నిండి పొట్టలో సమస్యలకు కారణమవుతుంది. కాబట్టి భోజనం చేసిన 2 గంటల తర్వాత పండ్లు తీసుకుంటే మంచిది. టీకి నో భోజనం చేసిన తర్వాత టీ అసలు తాగకూడదు. ఎందుకంటే టీ తాగితే ఎక్కువ మోతాదులో ఆసిడ్ విడుదలై.. ఆహారం జీర్ణమవడానికి కష్టమవుతుంది. స్నానం చేయకూడదు భోజనం చేసిన వెంటనే స్నానం చేయకూడదు. దీనివల్ల రక్తం అంతా చేతులకి కళ్లకి మొత్తం ఒంటికి పాకి, పొట్ట దగ్గర రక్తం తగ్గిపోయి జీర్ణ ప్రక్రియని నెమ్మది చేస్తుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ సామర్ధ్యం తగ్గిపోతుంది. నిద్రపోకూడదు భోజనం చేసిన వెంటనే పడుకుంటే ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వక గ్యాస్ర్టిక్ ట్రబుల్ తోపాటు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలుంటాయి. మాములుగా భోజనం చేసిన వెంటనే ఎవరికైనా నిద్ర వస్తుంది. మరీ ఎక్కవగా నిద్ర వస్తుంటే.. 15 నుంచి 20 నిముషాల కంటే ఎక్కువగా పడుకోకూడదు.
తాజా వార్తలు
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్‌కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్‌పీరియన్స్‌తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!
- జెడ్డాలో భారీగా పట్టుబడ్డ నకిలీ బ్రాండెడ్ దుస్తులు..!!
- కొత్త మల్టిపుల్ ఎంట్రీ వీసాను ప్రవేశపెట్టిన సౌదీ..!!







