ఈజిప్టియన్ బెల్లీ డాన్సర్ కు మూడేళ్ళ జైలు శిక్ష
- June 28, 2020కైరో:టిక్‌టాక్‌తో పాటు ఇతర సామాజిక మాధ్యమాల్లో అసభ్య వీడియోలు పోస్ట్ చేస్తున్న బెల్లీ డ్యాన్సర్‌కు ఈజిప్ట్ కోర్టు జైలు శిక్ష విధించింది. ఆమె పోస్టులు సంబంధ బాంధవ్యాలకు మచ్చ తెచ్చే విధంగా ఉన్నాయంటూ మండిపడింది. దీంతో 3 లక్షల ఈజిప్టియన్ పౌండ్ల జరిమానాతోపాటు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. ఈజిప్షియన్ బెల్లీ డ్యాన్సర్ సామా ఎల్ మాస్రీ(42) సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు, అసభ్యకర వీడియోలు పోస్టు చేసింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమెను ఏప్రిల్‌లో అరెస్టు చేశారు.
ఆమె సోషల్ మీడియా అకౌంట్లపైనా దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం విచారణ చేపట్టిన కోర్టు.. సాంప్రదాయ విధానాలను ఉల్లంఘిస్తూ, విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించే విధంగా ఆమె పోస్టులు ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇందుకు ప్రతిఫలంగా మూడేళ్ల జైలు శిక్షతో పాటు మూడు లక్షల పౌండ్ల జరిమానా విధించింది. అయితే ఎవరో తన సమాచారాన్ని దొంగిలించి, కావాలనే తన అకౌంట్ల నుంచి పోస్ట్ చేస్తున్నారని ఆమె వాపోయింది. దీనిపై కోర్టుకెళతానని, న్యాయం జరిగేవరకు పోరాడుతానని తెలిపింది. కాగా అసభ్య వీడియోలు పోస్ట్ చేసే ఇతర టిక్‌టాక్ అకౌంట్లపైనా చర్యలు తప్పవని ఈజిప్ట్ అధికారులు హెచ్చరించారు.
తాజా వార్తలు
- పేటీఎం లైట్ వ్యాలెట్ రోజువారీ లిమిట్ పెరిగిందోచ్..
- సీఎం జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్
- HM సుల్తాన్ తో కువైట్ ఎమిర్ కీలక చర్చలు
- దోమలు ఎక్కువగా కనిపిస్తున్నాయా?
- అరబ్ సమ్మిట్.. ట్రాఫిక్ అడ్వైజరీ అలర్ట్ జారీ
- సౌదీ అరేబియాలో నర్సింగ్ సిబ్బందికి ఫుల్ డిమాండ్..!
- దుబాయ్ టూరిస్ట్ వీసా పొడిగింపు.. ఫీజులు, ప్రక్రియ
- PAM డైరెక్టర్ తో భారత రాయబారి సమావేశం
- కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- 110 రోజుల పాటు 200 విమానాల్లో ప్రయాణించి..పోలీసులకు చిక్కాడు..