కువైట్: రెసిడెన్సీ టాన్స్ ఫర్, వెహికిల్ ఓనర్ షిప్ బదిలీ సేవలు మంగళవారం నుంచి ప్రారంభం

- June 28, 2020 , by Maagulf
కువైట్: రెసిడెన్సీ టాన్స్ ఫర్, వెహికిల్ ఓనర్ షిప్ బదిలీ సేవలు మంగళవారం నుంచి ప్రారంభం

కువైట్ సిటీ:లాక్ డౌన్ తర్వాత మళ్లీ సాధారణ పరిస్థితుల నెలకొల్పడంలో భాగంగా మంత్రిమండలి సూచనల మేరకు ప్రభుత్వ కార్యలయాలు తమ సేవలను ప్రారంభించబోతున్నాయి. మంగళవారం నుంచి ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రభుత్వ కార్యాలయాలు తెరిచిఉంటాయని అంతర్గత మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నివాసిన అనుమతులకు సంబంధించి మంగళవారం నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. తొలిసారిగా కువైట్ నివాస అనుమతి పొందాలనుకునే వారు, నివాస అనుమతిని ఒక స్పాన్సర్ నుంచి మరోకరిని బదిలి చేయాలనుకునేవారు మినిస్ట్రి ఆఫీస్ లో మంగళవారం నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయిన వారికి మంగళవారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ల జారీ కొనసాగుతుందని ట్రాఫిక్
విభాగం అధికారులు వెల్లడించారు. వాహనాల రెన్యూవల్, వాహనాల ఓనర్ షిప్ బదిలీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి జరిమానా చెల్లింపులు కూడా ఇక ఆఫీసులోనే చేయవచ్చు. అయితే..ముందుగా www.moi.gov.kwలో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదిలాఉంటే..ప్రభుత్వ సేవల కోసం మినిస్ట్రి కార్యాలయాలకు వచ్చే వారు ఖచ్చితంగా భౌతిక దూరం పాటించాలని, మాస్కులు ధరించాలని అంతర్గత మంత్రిత్వ శాఖ సూచించింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com