పాకిస్థాన్ లో రెండు లక్షలు దాటిన కరోనా కేసులు
- June 28, 2020
పాకిస్థాన్ లో కరోనా వైరస్ విశ్వరూపం ప్రదర్శిస్తోంది. ఆదివారం 4,072 కొత్త కేసులు నమోదయ్యాయి,దాంతో పాజిటివ్ కేసుల సంఖ్య 202,955 కు పెరిగింది. వ్యాధి సోకిన వారిలో 92,000 మందికి పైగా అంటే 45 శాతం మందికి కోలుకోగా, 2,805 మందికి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ఇప్పటివరకూ మొత్తం 4,118 మరణాలు సంభవించాయి. గత 20 రోజులలో 100,000 కంటే ఎక్కువ కొత్త కేసులు నమోదయ్యాయి, అయితే జూన్ 30 నాటికి ఈ సంఖ్య 225,000 వరకు ఉండవచ్చని ప్రభుత్వ అంచనాలు సూచిస్తున్నాయి.
మరోవైపు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ మొదటి నుండి వైరస్ పై పోరాడటానికి ఎక్కువకాలం లాక్డౌన్ పెట్టడాన్ని వ్యతిరేకించారు, దేశ ఆర్థిక వ్యవస్థ దానిని భరించలేదని వాదించారు. దీంతో లాక్ డౌన్ లేకపోవడంతో ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారు. దాంతో వైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఇదిలావుంటే పాకిస్థాన్ లో జూన్ 14 నుండి 20 ప్రధాన నగరాల్లో వైరస్ హాట్‌స్పాట్‌లను గుర్తించారు. ఇక్కడే లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేయాలనీ ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







