కువైట్ లో 500 కుటుంబాలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ

- June 29, 2020 , by Maagulf
కువైట్ లో 500 కుటుంబాలకు నిత్యావసరాల సరుకుల పంపిణీ

కువైట్:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి కన్వీనర్  ముమ్మిడి బాలిరెడ్డి మరియు ఎపిఎన్ఆర్టిస్ డైరెక్టర్ బి.హెచ్ ఇలియాస్  విజ్ఞప్తి మేరకు, కరోనా వైరస్ కారణంగా కువైట్ లో లాక్ డౌన్ పరిస్థితి దృష్ట్యా ఇండ్లకే పరిమితమై పనులు లేక  ఇబ్బందులు పడుతున్న ప్రవాసాంధ్రులకు చేయూత అందించి, తన పెద్ద మనస్సుతో 500 కుటుంబాల వారికి తన వంతు ఆర్ధిక సహాయం అందించిన రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి సభ్యులు తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు. 

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కువైట్ కమిటి వారి ఆధ్వర్యంలో కువైట్ లో లాక్ డౌన్ పరిస్థితి దృష్ట్యా ఇండ్లకే పరిమితం ఐన ప్రవాసాంధ్రులకు గత 15 రోజుల నుంచి నిత్యావసర సరుకులు పంపిణి చేస్తున్నారు.

కష్టకాలంలోమనప్రవాసాంధ్రులకుఎక్కువమందికిసహాయసహకారాలు అందించేందుకు తన వంతు ఆర్ధిక సహాయం చేసిన పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డికి  ముమ్మిడి బాలిరెడ్డి  కృతజ్ఞతలు తెలియజేశారు.

--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com