ఒమన్‌కి వచ్చే పర్యాటకులకు హెల్త్ ఇన్స్యూరెన్స్ తప్పనిసరి
- June 29, 2020
మస్కట్: మినిస్ట్రీ ఆఫ్ టూరిజం, టూర్ మరియు ట్రావెల్ ఆఫీసులకు కొన్ని స్పష్టమైన సూచనలు చేయడం జరిగింది. దేశంలో టూరిజం సెక్టార్ మళ్ళీ పుంజుకోనున్న దరిమిలా, ఈ సూచనలు చేయడం జరిగింది. సుప్రీం కమిటీ చేసిన సూచనలకు ఇవి అదనం. ట్రావెలర్స్‌కి మెడికల్ సర్టిఫికెట్‌తోపాటు, ఇన్స్యూరెన్స్‌ని తప్పనిసరి చేశారు. అన్ని రిజర్వేషన్స్ కేవలం ఆన్లైన్ ద్వారా చేయాల్సి వుంటుందనీ, క్యాష్ పేమెంట్ని అనుమతించవద్దని మినిస్ట్రీ సూచించింది. 16 మంది కంటే ఎక్కువ సంఖ్యలో టూరిస్టుల్ని వుంచకుండా గ్రూప్స్ మెయిన్‌టెయిన్ చేయాల్సి వుంటుంది. వారిని కూడా సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడాలి. చెక్ ఇన్ సమయంలో ప్రత్యేకంగా పెన్స్‌ని వినియోగించాలి. వెయిటింగ్ రూమ్స్ టెంపరరీ చెయిర్స్, వాటర్ బాటిల్స్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సి వుంటుంది. ట్రావెలర్స్‌కి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయడంతోపాటుగా, డిజిటల్ థర్మామీటర్‌తో వారి ఉష్ణోగ్రతల్ని పరిశీలించి, నమోదు చేయాలి. బఫెట్ సిస్టమ్ దగ్గర కూడా సేఫ్ డిస్టెన్స్ మెయిన్‌టెయిన్ చేసేలా చూడాలి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?