మిడ్‌ డే వర్క్‌: 42 కంపెనీలకు హెచ్చరిక

మిడ్‌ డే వర్క్‌: 42 కంపెనీలకు హెచ్చరిక

కువైట్ సిటీ:వేసవి నేపథ్యంలో మిడ్‌ డే వర్క్‌ బ్యాన్‌ అమల్లో వున్నా, దాన్ని అమలు చేయని 42 కంపెనీలకు నోటీసులు పంపించడం జరిగింది. తొలిసారి ఉల్లంఘన నేపథ్యంలో సదరు కంపెనీలకు నోటీసులు పంపామనీ, ఆ తర్వాత కరిన చర్యలుంటాయని అధికారులు పేర్కొన్నారు. జూన్‌ 20 నుంచి 25 వరకు ఆక్యుపేషనల్‌ సేఫ్టీ ఇన్‌స్పెక్టర్స్‌ 29 విజిట్స్‌ చేయడం జరిగింది వర్క్‌ సైట్స్‌లో. ఈ క్రమంలో 63 మంది కార్మికులు ఉల్లంఘనలకు విరుద్ధంగా పనిచేస్తున్నట్లు గుర్తించారు. రెండో విజిట్‌లో, ఇన్‌స్పెక్టర్స్‌కి ఎలాంటి ఉల్లంఘనలు కన్పించలేదు. కాగా, సిటిజన్స్‌ అలాగే రెసిడెంట్స్‌.. ఎవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే హాట్‌లైన్‌ (99444800) నెంబర్‌కి ఫిర్యాదులు చేయవచ్చు.

Back to Top