ఏపీలో ఒక్కరోజే 11 కరోనా మరణాలు...

ఏపీలో ఒక్కరోజే 11 కరోనా మరణాలు...

అమరావతి:ఏపీలోని గడిచిన 24 గంటల్లో 793 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ తెలిపింది. ఈరోజు ఒక్కరోజే.. 11 మంది చనిపోయారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 13,891మందికి చేరింది. ఇప్పటివరకూ 6232 మంది డిశ్చార్జ్ అవ్వగా.. 7479 మంది చికిత్స పొందుతున్నారు. తాజాగా నమోదైన కేసుల్లో 708 మంది రాష్ట్రంలో వారు కాగా.. 81 మంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు ఉన్నారు. అటు, విదేశాల నుంచి వచ్చిన వారికి ఆరుగురికి కరోనా సోకిందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 180 మంది కరోనాతో మృతి చెందారు.

--ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)

Back to Top