సిమ్ కార్డ్ స్కామ్: 17 మంది వలసదారుల అరెస్ట్
- June 30, 2020
రియాద్: సౌదీ పోలీస్, 17 మంది వలసదారుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. నిందితులు ఫోర్జరీ ఐడీ కార్డుల సాయంతో అక్రమంగా సిమ్ కార్డుల్ని రూపొందించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇందుకోసం అల్ అజిజియా ప్రాంతంలో రెండు అపార్ట్‌మెంట్లను వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. రియాద్ పోలీస్ అధికార ప్రతినిది¸ కల్నల్ షాకెర్ మాట్లాడుతూ, నిందితుల్లో ఈజిప్టియన్, సిరియన్, యెమెనీ సహా బంగ్లాదేశీ జాతీయులు వున్నట్లు వివరించారు.నిందితుల దగ్గర్నుంచి 9,000 సిమ్ కార్డుల్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. వారి నుంచి మూడు ఫింగర్ ప్రింట్ రీడర్లు, కంప్యూటర్లు, స్కానర్లను కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇల్లీగల్ బ్రోకరేజ్ యాక్టివిటీకి పాల్పడుతున్నట్లు నిందితులు విచారణలో అంగీకరించారు. నిందితుల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి అప్పగించడం జరిగింది.
తాజా వార్తలు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..