జులైలో మరో 15 డెస్టినేషన్స్‌తో ఎతిహాద్ విస్తరణ
- June 30, 2020
అబుధాబి కేంద్రంగా పనిచేస్తోన్న ఎతిహాద్ ఎయిర్‌వేస్, మరో 15 డెస్టినేషన్స్‌ని వచ్చే నెలలో యాడ్ చేయనుంది. భారత ఉప ఖండంలో పలు ప్రముఖ నగరాల్ని ఇందులో పొందుపరిచారు. జూన్ 24న ఏథెన్స్, గ్రీస్‌లను లిస్ట్‌లో యాడ్ చేసిన విషయం విదితమే. ప్రస్తుతం 25 డెస్టినేషన్స్‌కి విమానాలు నడుస్తున్నాయి. కాగా, జులై 16 నుంచి భారత నగరాలైన బెంగళూరు, చెన్నయ్, ఢిల్లీ, హైదరాబాద్, కోచి, కోజికోడ్ మరియు ముంబైలకు విమానాలు నడపనున్నారు. జులై 16 నుంచి మాల్దీవ్‌కి కూడా విమాన సర్వీసులు నడుస్తాయి. పాకిస్తాన్ విషయానికొస్తే, కేవలం ఇన్‌బౌండ్ విమానాలు మాత్రమే మూడు పాకిస్తానీ నగరాలు ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్‌లకు పరిమితం చేశారు. మిడిల్ ఈస్ట్‌లో అమ్మాన్ మరియు కైరోలకు జులై 16 నుంచి విమానలు నడుపుతుంది. ఎయిర్‌పోర్ట్‌కి వెళ్ళడానికంటే ముందే ప్రయాణీకులు కోవిడ్ 19 పరీక్ష చేయించుకోవాల్సి వుంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?