జులై 5 నుంచి రస్‌ అల్‌ ఖైమా గవర్నమెంట్‌ స్టాఫ్‌ తిరిగి విధుల్లోకి

జులై 5 నుంచి రస్‌ అల్‌ ఖైమా గవర్నమెంట్‌ స్టాఫ్‌ తిరిగి విధుల్లోకి

రస్‌ అల్‌ ఖైమా:జులై 5 నుంచి 100 శాతం సామర్థ్యంతో రస్‌ అల్‌ ఖైమా గవర్నమెంట్‌ ఆఫీసులు తిరిగి తమ కార్యకలాపాల్ని ప్రారంభించనున్నాయి. రస్‌ అల్‌ ఖైమా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హ్యామన్‌ రిసోర్సెస్‌ ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. క్రానిక్‌ డిసీజెస్‌తో బాధపడుతున్నవారికి మాత్రమే మినహాయింపులు ఇచ్చామనీ, మిగతా ఉద్యోగులంతా తమ విధులకు హాజరు కావాల్సిందేనని డిపార్ట్‌మెంట్‌ తేల్చి చెప్పింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో ఆయా రంగాల్లో స్తబ్దత నెలకొంది. తిరిగి బిజినెస్‌ నార్మల్సీ కోసం ప్రయత్నాలు జోరందుకున్నాయి. ఈ క్రమంలోనే 100 శాతం సామర్థ్యంతో గవర్నమెంట్‌ ఆఫీసులు కూడా రన్‌ కానున్నాయి.

 

Back to Top