యాంటీ కోవిడ్ నిబంధనలు ఉల్లంఘన: పలువురికి జరిమానాలు
- July 02, 2020
యూఏఈ పబ్లిక్ ప్రాసిక్యూషన్, కరోనా వైరస్ (కోవిడ్ 19) నేపథ్యంలో ఉల్లంఘనలకు పాల్పడినవారికి జరీమానాలు విధించడం జరిగింది. అలాగే వారి పేర్లను, వారి ఫొటోల్ని వెల్లడించారు. 2,000 దిర్హామ్ ల నుంచి 10,000 దిర్హామ్ ల వరకు జరీమానాలు విధించారు. మాస్క్‌లు ధరించకపోవడం, కర్ఫ్యూ నిబంధనల్ని ఉల్లంఘించడం, పార్టీలు నిర్వహించడం వంటి చర్యలకు ఈ జరీమానాలు విధించడం జరిగింది. హెల్త్ అండ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవర్నీ ఉపేక్షించే అవకాశమే లేదని చెప్పడం కోసం ఈ నేమ్ అండ్ షేమ్ చర్యలు కూడా తీసుకున్నారు. ముగ్గురు ఆసియా వ్యక్తుల ఫొటోల్ని పబ్లిష్ చేశారు. ఓ ఎమిరేటీ అలాగే ఇద్దరు ఆసియా వ్యక్తుల ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. అరబ్ జాతీయుడొకరికి 10,000 దిర్హామ్ ల జరీమానా విధించడం జరిగింది. మరో ముగ్గురు అరబ్స్కి ఓ ఆసియా జాతీయుడికి 5,000 దిర్హామ్ ల చొప్పున జరీమానా విధించారు.
తాజా వార్తలు
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన
- భారత్-పాక్ మ్యాచ్ ఎక్కడ చూడొచ్చంటే?
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!