ట్యాక్సీ ఓనర్స్, మహిళలకు లోన్ స్కీం ప్రకటించిన ఒమన్
- July 03, 2020
మస్కట్:కరోనా సంక్షోభం నేపథ్యంలో కొన్ని రంగాలను ఆదుకునేందుకు ఒమన్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. స్వయం ఉపాధి పొందుతున్న వారికి అలాగే చిన్న సూక్ష్మ పరిశ్రమ రంగాలకు రుణాలు ఇచ్చేందుకు లోన్ స్కీం ప్రకటించింది. దీనికి సంబంధించి ప్రణాళికను కూడా పూర్తి చేసినట్లు ఒమన్ డెవలప్మెంట్ బ్యాంక్ సీఈవో డాక్టర్ అబ్దుల్లాజీజ్ బిన్ మొహమ్మద్ అల్ హినై తెలిపారు. ఈ లోన్ స్కీం ద్వారా ఫుల్ టైం ట్యాక్సీ నడిపేవారికి, డ్రైవింగ్ శిక్షణ ఇచ్చే వారికి రుణాలు అందినున్నారు. అలాగే వివిధ రంగాల్లో స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు కూడా లోన్ స్కీం ద్వారా లబ్ధిపొందనున్నారు. ముఖ్యంగా కాస్మటిక్ షాప్స్, బేబి సిట్టర్స్ కి రుణాలు ఇవ్వనున్నారు. ఇక కరోనా కారణంగా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కుంటున్న మైక్రో ఎంటర్ ప్రైజెస్ నిర్వాహకులకు కూడా రుణాలు అందించనున్నారు. నాలుగేళ్లలో రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?