బెలూన్ లో అంతరిక్ష ప్రయాణం.!
- July 03, 2020
అంతరిక్షం గురించి తెలుసుకోవాలని, అంతరిక్షంలో ప్రయాణం చేయాలని అందరికి ఉంటుంది. కానీ, కొందరే ఆ డ్రీమ్ ను సాధించుకోగలుగుతారు. ఒకప్పుడు కేవలం స్పేస్ పరిశోధకులు మాత్రమే అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం ఉండేది. ఎప్పుడైతే స్పేస్ ఎక్స్ అనే సంస్థ స్పేస్ టూరిజాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చిందో అప్పటి నుంచే స్పేస్ లోకి సరదాగా వెళ్ళొచ్చేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. అయితే, రాకెట్లు, స్పేస్ షటిల్స్ లో కాకుండా ఇప్పుడు బెలూన్ సహాయంతో స్పేస్ లోకి వెళ్లొచ్చని అంటోంది ఫ్లోరిడాకు చెందిన స్పేస్ పర్స్పెక్టివ్ అనే సంస్థ.
ఈ సంస్థ స్పేస్ షిప్ నెప్ట్యూన్ పేరుతో ఓ బెలూన్ ను తయారు చేసింది. ఈ బెలూన్ సహాయంతో అంతరిక్షంలోకి వెళ్లిరావొచ్చు. భూమి మీద నుంచి దాదాపుగా లక్ష అడుగుల ఎత్తు వరకు ఈ బెలూన్ ప్రయాణం చేస్తుంది. 8 మంది పర్యాటకులను తీసుకెళ్లే సామర్ధ్యం కలిగిన ఈ స్పేస్ షిప్ నెప్ట్యూన్ స్పేస్ లో 6 గంటలపాటు ప్రయాణం చేస్తుంది. సూర్యోదయ సూర్యాస్తమయాలు ఎలా ఉంటాయని తెలుసుకోవచ్చు. 6 గంటలపాటు స్పేస్ షిప్ నెప్ట్యూన్ లో ప్రయాణం చేయడానికి టికెట్ ధర 1,25,000 డాలర్లు ఉండే అవకాశం ఉందని స్పేస్ పర్స్పెక్టివ్ సంస్థ తెలిపింది.

తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







