పార్క్‌లు, మాల్స్‌ల్లో రిటెయిల్‌ ఔట్‌లెట్స్‌ పునఃప్రారంభం

పార్క్‌లు, మాల్స్‌ల్లో రిటెయిల్‌ ఔట్‌లెట్స్‌ పునఃప్రారంభం

దోహా: మూడు నెలలపాటు మూసివేయబడిన పార్క్‌లు, మాల్స్‌లో రిటెయిల్‌ ఔట్‌లెట్స్‌ వంటివి తెరుచుకోనున్నాయి. ఒక్కొక్కటిగా ఆంక్షలు తొలగిస్తూ వస్తున్న నేపథ్యంలో జనజీవనం తిరిగి సాధారణ స్థితికి చేరుకోనుంది. సౌక్‌ వాకిఫ్‌, సెంట్రల్‌ మార్కెట్‌, మ్యూజియంలు, పెరల్‌ కతార్‌ ఇతర పబ్లిక్‌ ప్లేస్‌లు జనంతో కన్పిస్తున్నాయి. విజిటర్స్‌ అలాగే షాపర్స్‌, ప్రివెంటివ్‌ మెజర్స్‌ పాటిస్తున్నారు. సోషల్‌ డిస్టెన్సింగ్‌ పట్ల అవగాహన పెరిగింది. మాస్క్‌లు ధరిస్తున్నారు. రెండో ఫేజ్‌ బిగినింగ్‌ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వుండాలని ఈ సందర్భంగా ఖతార్‌ గవర్నమెంట్‌ కమ్యూనికేషన్స్‌ ఆఫీస్‌ సూచించింది. 

Back to Top