సౌదీ అరేబియా: షాపులు, మార్కెట్లలో తనిఖీలు..
- July 04, 2020
సౌదీ అరేబియా:పలు మార్కెట్లు, షాపులలో నిబంధనలు పాటించటం లేదని ఫిర్యాదులు వెల్లువెత్తటంతో వాణిజ్య మంత్రిత్వ శాఖ ముమ్మర తనిఖీలు చేపట్టింది. తబుక్ ప్రాంతంలోని పలు రిటైల్ షాపులు, మార్కెట్లు, ఫార్మసిస్, స్టీల్, సిమెంట్, బిల్డింగ్ మెటీరియల్స్, పెట్రోల్ స్టేషన్స్ లలో తనిఖీలు చేపట్టింది. వాస్తవ ధరల కంటే అధిక ధరలకు విక్రయించటం, కృత్రిమ కొరత సృష్టించటం వంటి నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు విధించారు. మొత్తం 1,590 చోట్ల తనిఖీలు చేపట్టగా..నిబంధనలు పాటించని 161 మందికి అక్కడిక్కడే జరిమానాలు విధించారు. అలాగే ఖస్సిమ్ ప్రాంతంలోని షాపులు, మార్కెట్లలో 8,700 చోట్ల తనిఖీలు నిర్వహించి 418 మందికి ఫైన్లు విధించారు.
తాజా వార్తలు
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!







