రిక్రియేషన్‌ సెంటర్స్‌, థీమ్ పార్క్‌లు, సమ్మర్‌ క్యాంప్‌ల రీ-ఓపెన్‌

- July 04, 2020 , by Maagulf
రిక్రియేషన్‌ సెంటర్స్‌, థీమ్ పార్క్‌లు, సమ్మర్‌ క్యాంప్‌ల రీ-ఓపెన్‌

దుబాయ్‌లో పలు రిక్రియేషనల్‌ యాక్టివిటీస్‌, సమ్మర్‌ క్యాంపులు, స్పా మరియు మసాజ్‌ సెంటర్స్‌ అలాగే ఇండోర్‌ థీమ్ పార్క్‌లు పున ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. ఎమిరేట్‌లో ఫేజుల వారీగా బిజినెస్‌ యాక్టివిటీస్‌ పునఃప్రారంభించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టారు. ఫన్‌ ఫెయిర్స్‌, రైడ్స్‌ని ఆఫర్‌ చేసే ఫెసిలిటీస్‌, సాఫ్ట్‌ ప్లే యాక్టివిటీస్‌, ఇండోర్‌ ప్లేగ్రౌండ్‌ యాక్టివిటీస్‌ అలాగే అడ్వెంచర్స్‌, ఇన్‌ఫ్లాటబుల్‌ ప్లే గ్రౌండ్స్‌, వర్చువల్‌ రియాలిటీ ఫెసిలిటీస్‌, ఎడ్యుటైన్‌మెంట్‌ ఫెసిలిటీస్‌ వంటివాటికి అనుమతులు జారీ చేశారు. అయితే, పార్టీలూ సోషల్‌ గ్యాదరింగ్స్‌ని మాత్రం అనుమతించలేదు. టాడ్లర్‌ అలాగే బేబీ సాఫ్ట్‌ ప్లేస్‌ ఏరియాస్‌కి కూడా అనుమతులు ఇవ్వలేదు. చైల్డ్‌ సెంటర్స్‌, స్కూల్స్‌, హోటల్స్‌, స్పోర్ట్స్‌ క్లబ్స్‌, జిమ్స్, లైబ్రరీస్‌ వంటివాటితోపాటు సమ్మర్‌ క్యాంప్స్‌కి కూడా అనుమతులు జారీ చేయడం జరిగింది. శనివారం నుంచి మసాజ్‌ సర్వీసులు, స్పా సెంటర్స్‌ ప్రారంభమవుతున్నాయి. అయితే, ఖచ్చితమైన భద్రతా చర్యలు పాటించాల్సి వుంటుంది అనుమతులివ్వబడిన ఆయా అంశాల్లో.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com