రెసిడెన్సీ వీసాలు ఉన్న ప్రవాసీయులు తిరిగి రావొచ్చు..కువైట్ స్పష్టీకరణ
- July 04, 2020
కువైట్ సిటీ:లాక్ డౌన్ వివిధ దేశాల్లో ఉండిపోయిన కువైట్ రెసిడెన్సీ వీసాదారులు తిరిగి రావొచ్చని ఆ దేశ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆగస్ట్ 1 నుంచి కమర్షియల్ ఫ్లైట్ సర్వీసులు ప్రారంభం అవుతున్నాయని, అదే రోజు నుంచి అర్హత కలిగిన వీసాదారులు అంతా కువైట్ తిరిగి రావొచ్చని వెల్లడించింది. అయితే..కరోనా నేపథ్యంలో కువైట్ ప్రభుత్వం అనుసరిస్తున్న అన్ని మార్గదర్శకాలను రెసిడెన్సీ వీసాదారులు పాటించాల్సి ఉంటుందని కూడా స్పష్టం చేసింది. ప్రయాణానికి ముందే కరోనా సోకలేదని నిరూపించుకునేందుకు గుర్తింపు పొందిన పీసీఆర్ సర్టిఫికెట్ ను చూపించాల్సి ఉంటుంది. అలాగే విమానం ఎక్కే ముందే శ్లోనిక్ లో రిజిస్టర్ కావాల్సి ఉంటుంది. అలాగే కువైట్ చేరుకున్నాక స్వీయ గృహ నిర్బంధంలోగానీ, ప్రభుత్వం, ఇతర సంస్థలు ఏర్పాటు చేసిన నిర్బంధ శిబిరాల్లోగాని ఉండేందుకు అంగీకరిస్తూ ముందస్తుగానే సంతకాలు చేయాలని కూడా షరతు విధించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?