జైలు శిక్షల్ని సమర్థించిన న్యాయస్థానం

- July 04, 2020 , by Maagulf
జైలు శిక్షల్ని సమర్థించిన న్యాయస్థానం

మనామా:పోలీస్‌ పెట్రోల్‌పై దాడి చేసిన ఇద్దరు వ్యక్తులకు కింది న్యాయస్థానం విధించిన ఏడేళ్ళ జైలు శిక్షను, పై కోర్టు సమర్థించింది. 2017లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు నిందితులు, పోలీసులపై దాడి చేశారు. మోలోటోవ్‌ కాక్‌టెయిల్స్‌తో ఈ దాడి జరిగింది. నిందితుల్ని అరెస్ట్‌ చేశారు పోలీసులు. కింది న్యాయస్థానం ఇద్దరు వ్యక్తులకు పదేళ్ళ జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత అప్పీల్‌ నేపథ్యంలో జైలు శిక్ష ఏడేళ్ళకు కుదించబడింది. తాజాగా టాప్‌ కోర్ట్‌, నిందితుల జైలు శిక్షను ఏడేళ్ళకు సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com