కేంద్రం జారీ చేసిన నూతన మార్గదర్శకాలు
- July 04, 2020
న్యూ ఢిల్లీ:హోం క్వారంటైన్ లో ఉన్నవారు పాటించవలసిన నియమ నిబంధనలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ జారీ చేసింది. లక్షణాలు తక్కువగా ఉన్నవారే హోం క్వారంటైన్ లో ఉండాలని సూచించింది. హెచ్ఐవీ, క్యాన్సర్, ట్రాన్స్ ప్లాంట్ చేయించుకున్నవారు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు హోం ఐసోలేషన్ కు అర్హులు కారు. వీరితో పాటు 60 ఏళ్లు దాటిన వృద్ధులు, ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నవారు హోం క్వారంటైన్ లో ఉండాలంటే వైద్యుని అనుమతి తప్పనిసరి.
గత కొన్ని రోజులుగా వస్తున్న కరోనా కేసుల్లో ఏ విధమైన రోగ లక్షణాలు లేకుండానే పాజిటివ్ వస్తుంది. దీంతో కేంద్ర ఆరోగ్య శాఖ హోం ఐసోలేషన్ కు సంబంధించి నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఇంట్లోనే ఉండి జాగ్రత్తలు పాటించిన 10 రోజుల తరువాత వరుసగా మూడు రోజులు జ్వరం రాకుండా ఉండే వారికి కరోనా లేదని నిర్ధారించుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు భావించాలని సూచించింది. అయినా సరే మరో ఏడు రోజులు ఇంట్లోనే ఉంటూ తమని తాము పరిరక్షించుకోవాలని తెలిపింది. గడువు పూర్తయిన తరువాత కొవిడ్ చేయించుకోవాల్సిన పని లేదని పేర్కొంది.
కానీ హోం ఐసోలేషన్ లో ఉన్న వారు ఇతర కుటుంబసభ్యులతో కలవకుండా జాగ్రత్త పడాలని సూచించింది. రోగితో పాటు సన్నిహితంగా ఉండేవారు ముందు జాగ్రత్తగా వైద్యుని సలహా మేరకు హైడ్రాక్సీక్లోరోక్విన్ ఔషధాన్ని తీసుకోవాలని తెలిపింది. ఆరోగ్య సేతు యాప్ డౌన్ లోడ్ చేసుకుని దాన్ని నిరంతరం యాక్టివ్ గా ఉంచాలని తెలిపింది. ఆరోగ్య కార్యకర్తలు నిరంతరం హోం క్వారంటైన్ లో ఉన్నవారిని పర్యవేక్షించాలని తెలిపింది. ఉష్ణోగ్రత, పల్స్ రేటు వంటివి రికార్డు చేయాలి. రోగుల కుటుంబసభ్యులకు, సన్నిహితులకు ప్రొటోకాల్ ప్రకారం పరీక్షలు నిర్వహించాలి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గుండెనొప్పి, మూర్చ, ముఖంలో నీలి రంగు రావడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?