ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ 13, 2021న అజయ్ దేవగన్ ‘మైదాన్’
- July 04, 2020
భారత ఫుట్ బాల్ ను ప్రపంచానికి పరిచయం చేసిన కోచ్ యధార్థ కథ ఆధారంగా స్టార్ హీరో అజయ్ దేవగన్ హీరోగా రూపొందుతున్న చిత్రం `మైదాన్`. ఫుట్ బాల్ కోచ్ గా అజయ్ దేవగన్ నటిస్తోన్న మైదాన్ ను క్రీడా నేపథ్యంలో ఒక స్ఫూర్తిమంతమైన కథగా నిర్మిస్తున్నారు. చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్స్ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. స్వాతంత్య్రదినోత్సవ కానుకగా మైదాన్ ను ఆగస్ట్ 13, 2021న హిందీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల చేయనున్నట్లు, ప్రతి భారతీయుడు గర్వపడేలా ఈ చిత్రం ఇతివృత్తం ఉంటుందని నిర్మాత బోనీ కపూర్ ప్రకటించారు.
నేషనల్ అవార్డ్ విన్నర్ ప్రియమణి, బధాయి హో ఫేమ్ గజరాజ్ రావు, పాపులర్ బెంగాలీ యాక్టర్ రుద్రనిల్ ఘోష్ ప్రముఖ పాత్రల్లో నటిస్తున్న మైదాన్ ని ఫ్రెష్‌లైమ్ ఫిల్మ్ సహకారంతో జీ స్టూడియోస్ బేనర్‌పై బోనీ కపూర్, ఆకాష్ చావ్లా, అరునవ జాయ్ సేన్ గుప్తా నిర్మిస్తున్నారు. బధాయి హో వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని డైరెక్ట్ చేసిన అమిత్ రవీంద్రనాథ్ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్‌కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్‌ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







