దుబాయ్:185 మంది ప్ర‌వాసుల కోసం ఛార్టర్డ్ విమానం ఏర్పాటు చేసిన వ్యాపారవేత్త

- July 04, 2020 , by Maagulf
దుబాయ్:185 మంది ప్ర‌వాసుల కోసం ఛార్టర్డ్ విమానం ఏర్పాటు చేసిన వ్యాపారవేత్త

దుబాయ్:దుబాయ్ లోని ఓ వ్యాపార‌వేత్త పెద్ద మ‌న‌సు చాటారు. క‌రోనా నేప‌థ్యంలో ఉపాధి కోల్పోయి స్వ‌దేశానికి తిరిగి వ‌చ్చేందుకు విమాన చార్టీలు కూడా క‌ట్టుకోలేని దయ‌నీయ‌స్థితిలో ఉన్న 185 భార‌త ప్ర‌వాసుల‌ను త‌న సొంత‌ ఖ‌ర్చుల‌తో ప్ర‌త్యేకంగా ఓ ఛార్టర్డ్ విమానం బుక్ చేసి ఇండియాకు పంపించారు. దుబాయ్ నుంచి కొచ్చికి వ‌చ్చిన ఈ విమానంలో గ‌ర్భిణీలు, వృద్ధులు, హెల్త్ ఎమ‌ర్జెన్సీ ఉన్న‌వారు, చిన్న పిల్ల‌లు ఉన్నారు.ఈ ఛార్టర్డ్ విమానాన్ని J&J మార్కెటింగ్ LLC మేనేజింగ్ డైరెక్ట‌ర్ జిజి వర్గీస్ ఏర్పాటు చేశారు. ఒక రోజు ముందే విమానం వెళ్ళడానికి అనుమతించిన భారత కాన్సుల్ జనరల్ విపుల్. విపత్క‌ర ప‌రిస్థితుల్లో ఉన్న త‌మ‌కు వ‌ర్గీస్ చేసిన ఈ సాయం ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేమ‌ని ఈ సంద‌ర్భంగా భార‌త ప్ర‌వాసులు అన్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com