గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన హీరో అల్లు శిరీష్
- July 04, 2020
రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 3వ విడతలో భాగంగా హీరో విశ్వక్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు తన ఇంటి గార్డెన్ లో మొక్కలు నాటిన హీరో అల్లు శిరిష్. ఈ సందర్భంగా శిరీష్ మాట్లాడుతూ ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టిన రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పడున్న జీవినవిధానంలో పర్యవరణ పరిరక్షణ అత్యంత అవసరం. అందుకే విధిగా మనందరం స్వచ్ఛందంగా మొక్కలు నాటాలని కోరుతున్నాను. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా విశ్వక్ సేన్ నాకిచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నా మేనల్లుడు ఆర్నావ్ మేనకోడల్లు అన్విత, సమారా, నివ్రితిలను ఈ కార్యక్రమానికి నామినేట్ చేస్తున్నాను. రానున్న కొత్త తరానికి చెట్లను, ఏ విధంగా నాటాలి, పెంచాలనే విషయం తెలియడం చాలా అవసరమని అన్నారు. అందుకే తన మేనల్లుడు, మేనకోడల్లకి ఈ ఛాలెంజ్ స్వీకరించాల్సిందిగా నామినేట్ చేస్తున్నట్లు తెలిపారు. అల్లు శిరీష్ ప్రస్తుతం తన తదుపరి సినిమాకి సంబంధించిన కార్యక్రమాల్లో ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన అధికారిక ప్రకటణ త్వరలోనే రాబోతుంది.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు