కరోనా విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం:WHO

- July 04, 2020 , by Maagulf
కరోనా విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయం:WHO

కరోనా విషయంలో భారత్ తీసుకుంటున్న చర్యలును ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించింది. భారతదేశానికి జనాభాయే పెద్ద సవాలని.. కానీ, దానిని కూడా అధిగమించి కరోనాను ఎదుర్కోంటుందని పేర్కొంది. మొదటి నుంచి డబ్ల్యూహెచ్ఓ సూచనలను పాటిస్తుందని తెలిపింది. కరోనా కట్టడిలో భాగంగా.. వ్యాధినిరోదక శక్తి పెంచుకోవడం, లాక్‌డౌన్ విధించడం, లాక్‌డౌన్‌కి సడలింపులు ఇవ్వడం అన్నీ పద్దతి ప్రకారం జరుగుతున్నాయని డబ్ల్యూహచ్ఓ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అన్నారు. భారత్ లో ప్రస్తుతం ఉన్న నాయకత్వమే ఆ దేశానికి బలమని అన్నారు. ప్రస్తుతం దేశంలో రోజుకు రెండు లక్షల కరోనా టెస్టులు జరగుతున్నాయని.. టెస్టింగ్ కిట్ల విషయంలో భారత్ స్వయం సమృద్దమైందని అన్నారు. భవిష్యత్ లో మరిన్ని ఎక్కువ టెస్టులు చేసే అవకాశం ఉందని అన్నారు. అయితే, కరోనాకు సంబందించిన డేటాను తెలియజేయటంలో మరింత శ్రద్ధ వహించాలని అన్నారు. కరోనా టెస్టులు, కేసులు, మరణాలు మాత్రమే తెలియజేస్తే.. ప్రజలకు కొంత సమాచారం మాత్రమే తెలుస్తుందని అన్నారు. కానీ, కొన్ని అంశాలతో పోలికలను చూపిస్తూ డేటా తయారు చేయాలని అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram
Copyrights 2015 | MaaGulf.com