ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చేవి ఇవే

- July 04, 2020 , by Maagulf
ఆదివారం నుంచి అందుబాటులోకి వచ్చేవి ఇవే

కువైట్ సిటీ:పబ్లిక్‌ అథారిటీ ఫర్‌ సివిల్‌ ఇన్ఫర్మేషన్‌ (పిఎసిఐ), ఆదివారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా అందుబాటులోకి వచ్చే ఆయా సర్వీసుల వివరాల్ని వెల్లడించింది. కువైటీ లేదా నాన్‌ కువైటీ న్యూ బోర్న్‌ రిజిస్ట్రేషన్‌కి సంబంధించి పర్సనల్‌ ఫొటో అప్‌డేట్‌, ఆర్టికల్‌ 20 - డొమెస్టిక్‌ వర్కర్‌ ఫస్ట్‌ టైమ్ రిజిస్ట్రేషన్‌, ఆర్టికల్‌ 22- ఫ్యామిలీ ఎన్‌రోల్‌మెంట్‌, ఆర్టికల్‌ 17, 18, 19, 23 అలాగే 24 - ఫస్ట్‌ టైమ్ రిజిస్ట్రేషన్‌ వంటివి అందుబాటులోకి వస్తున్నాయి. ఇతర సర్వీసులు పొందాలనుకునే వలసదారులు, వెబ్‌సైట్‌ ద్వారా అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకోవాల్సి వుంటుంది. డేట్‌ ఆఫ్‌ బర్త్‌ మార్పు లేదా కరెక్షన్‌, ట్రావెల్‌ డాక్యుమెంట్‌ రిజిస్ట్రేషన్‌ లేదా క్యాన్సిలేషన్‌, సర్టిఫికెట్ల ప్రింటింగ్‌, బిల్డింగ్‌ రికార్డ్‌, యాక్టివ్‌ పర్సన్‌ (కువైట్‌లో పుట్టినవారు), రెసిడెన్సీ కరెక్షన్‌ లేదా క్యాన్సిలేషన్‌, ఇల్లీగల్‌ రెసిడెంట్స్‌ ట్రాన్సాక్షన్‌ అలాగే, 5 ఏళ్ళు వచ్చిన చిన్నారుల ఫొటో జతపరచడం వంటివి ఈ విభాగంలో వుంటాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com