ప్రవాసీయులకు షాక్..విదేశీయుల కోటాను కుదిస్తూ కువైట్ కేబినెట్ ఆమోదం
- July 05, 2020
కువైట్ సిటీ:ప్రవాస భారతీయులతో పాటు తమ దేశంలోని విదేశీయులకు షాకిచ్చింది కువైట్ ప్రభుత్వం. ప్రవాసీయుల సంఖ్యను కుదించటమే లక్ష్యంగా విదేశీయుల కోటాను ఖరారు చేస్తూ చేసిన తీర్మానానికి కువైట్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అంతేకాదు..ఐదుగురు ఎంపీల బృందం సమర్పించిన ముసాయిదా బిల్లు రాజ్యంగపరంగా, చట్టపరంగా సరైన విధానంలోనే ఉందని జాతీయ అసెంబ్లీ లీగల్, లెజిస్లేటీవ్ కమిటీ కూడా నిర్ధారించింది. ఈ ముసాయిదా బిల్లు అమలులోకి వస్తే కువైట్ లో ఉంటున్న పలు దేశస్తులపై ప్రభావం చూపుతుంది. ప్రవాస భారతీయులు కువైట్ దేశస్థుల సంఖ్యలో 15 శాతానికి మించి ఉండకూడదు. అలాగే ఈజిప్టియన్లు, శ్రీలంకన్లు, ఫిలిపినోస్ కు సంబంధించి 10 శాతం చొప్పున మాత్రమే ఉండాలి. బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్తాన్, వియత్నంకు సంబంధించి ఒక్కో దేశం నుంచి 3 శాతం మంది మాత్రమే ఉండాలి. ఈ లెక్కన ఆయా దేశాల నుంచి వచ్చి కువైట్ లో ఉంటున్న వారిపై తీవ్ర ప్రభావం పడనుంది. 2018 జనాభా లెక్కల ప్రకారం కువైట్ జనాభా 41.4 లక్షలు. ఇక నుంచి ఈ మొత్తం జనాభాలో ప్రవాస భారతీయుల సంఖ్య 15 శాతం దాటకూడదు. ప్రస్తుతం కువైట్ లో దాదాపు 10 లక్షల జనాభా ఉన్నట్లు ఓ అంచనా. ప్రస్తుత కోటా ప్రకారం 6 లక్షల మందికి ప్రవాసభారతీయులను కుదించనున్నారు.
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?