వలస కార్మికుల పెండింగ్ వేతన సమస్యను పరిష్కరించిన బహ్రెయిన్
- July 05, 2020
మనామా:కొద్ది నెలలుగా జీతాలు లేకుండా అవస్థలు పడుతున్న వలస కార్మికుల సమస్యను బహ్రెయిన్ కార్మిక శాఖ పరిష్కరించింది. వారికి రావాల్సిన బకాయి వేతనాలు చెల్లించేలా పరిష్కార మార్గం చూపింది. కరోనా విపత్తుకు తోడు చమురు రంగం ఎదుర్కుంటున్న ఒడిదుడుకులతో కొన్నాళ్లుకు వలస కార్మికులకు జీతాలు అందక అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా బ్లూ కాలర్ కార్మికుల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో పదుల సంఖ్యలో వలస కార్మికులు బకాయి జీతాల కోసం ఇటీవల కార్మిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ముందు ఆందోళనకు దిగిన విషయం తెలిసింది. రెండు నిర్మాణ సంస్థలకు చెందిన దాదాపు 40 మంది ఈ ఆందోళనల్లో పాల్గొన్నారు. తమకు 8 నెలలుగా జీతాలు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాస్తా వైరల్ గా మారటంతో రంగంలోకి దిగిన కార్మిక శాఖ వలస కార్మికుల సమస్యను పరిష్కరించేందుకు ఆయా సంస్థలు చొరవ తీసుకోలేదని నిర్ధారణకు వచ్చింది. కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించే దిశగా పరిష్కార మార్గం చూపింది.
తాజా వార్తలు
- NEET UG సిలబస్ విడుదల
- తప్పు ఒప్పుకొన్న X..అశ్లీల పోస్టుల తొలగింపు
- అత్యంత ఘనంగా జరిగిన సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహావిష్కరణ
- మేడారం జాతరలో 30 మెడికల్ క్యాంపులు ఏర్పాటు: మంత్రి రాజనర్సింహ
- APSPDCL కు జాతీయ అవార్డులు
- నా యూట్యూబ్ వీడియోల్లో ప్రతి లైన్ ఫ్యాక్ట్ చెక్ చేసినదే: ధృవ్ రాఠీ
- సోమాలియా సార్వభౌమాధికారానికి OIC మద్దతు..!!
- షార్జాలో తప్పిపోయిన డాగ్..నెల రొజుల తర్వాత దొరికింది..!!
- స్వర్ణభారత్ ట్రస్ట్ ముచ్చింతల్లో సంక్రాంతి సంబరాలు
- ఆర్థిక స్వేచ్ఛ..గల్ఫ్ లో అగ్రస్థానంలో బహ్రెయిన్..!!







