ఏపీలో కొత్తగా 998 కరోనా కేసులు
- July 05, 2020
అమరావతి : కరోనా వైరస్ నిర్థారణ పరీక్షల్లో ఆంధ్రప్రదేశ్ మరో రికార్డు సృష్టించింది. వైద్య పరీక్షల్లో 10 లక్షల మార్క్‌ను దాటింది. ఆదివారం నాటికి 10,17,140 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు చేశారు. గడచిన 24 గంటల్లో 20,567 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా మొత్తం 961మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. వీటితోపాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 36మందికి, విదేశాల నుంచి వచ్చిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నమోదైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 18,697కు చేరింది. ఈ మేరకు ఆదివారం ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.
ఇక గడిచిన 24 గంటల్లో 391 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ కాగా, 14 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 232కు చేరింది. ఈ రోజు మృతి చెందిన వారిలో కర్నూలులో ఐదుగురు, అనంతపురంలో ముగ్గురు, చిత్తూరులో ఇద్దరు, కడపలో ఇద్దరు, కృష్ణ, విశాఖపట్నంలో ఒక్కొక్కరు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 10,043 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
----ఆర్.వి.ఆర్ ప్రసాద్(మాగల్ఫ్ ప్రతినిధి,ఏపీ)
తాజా వార్తలు
- ఒమన్‌లో అల్లర్లు..59 మంది ప్రవాసులకు జైలు శిక్ష..!!
- నిర్వహణ పనుల కోసం రోడ్ మూసివేత..!!
- కువైట్‌లో ఘనంగా ప్రపంచ హిందీ దినోత్సవం..!!
- 30 మిలియన్ దిర్హమ్స్ గెలుచుకున్న ఫిలిపినో ప్రవాసి..!!
- సౌదీ అరేబియాలో 18,836 మంది అరెస్టు..!!
- జల్లాక్లో తమిళ డయాస్పోరా మత్స్యకారుల పొంగల్..!!
- 8వ వేతన సంఘం పై బిగ్ అప్డేట్..
- అమెరికాలోనే భారీగా ఆయిల్ నిల్వలు..
- తెలంగాణ మున్సిపల్ బరిలో జనసేన
- సంక్రాంతికి ఊరెళ్తున్నారా?సీపీ సజ్జనార్ కీలక సూచనలు







