ఫేక్‌ జాబ్స్‌ అండ్‌ మ్యారేజెస్‌: మోసపోయిన 56 మంది యువతులు

- July 06, 2020 , by Maagulf
ఫేక్‌ జాబ్స్‌ అండ్‌ మ్యారేజెస్‌: మోసపోయిన 56 మంది యువతులు

రాయల్‌ ఒమన్‌ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఓ వ్యక్తి చేతిలో 56 మంది యువతులు మోసపోయారు. ఓ ఎయిర్‌లైన్‌లో ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి నిందితుడు వీరిని మోసం చేశాడు. కాగా, అందులో కొందరికి ‘పెళ్ళి’ పేరుతోనూ వల వేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పర్సనల్‌ ప్రొఫైల్‌, వ్యక్తిగత ఫొటోల్ని ఆ యువతుల నుంచి రప్పించుకున్నాక, వారిని బ్లాక్‌మెయిల్‌ చేశాడు నిందితుడు. నిందితుడ్ని అరెస్ట్‌ చేశామనీ, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు. ఈ తరహా మోసాల పట్ల అప్రమత్తంగా వుండాలని, తెలియనివారికి ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యక్తిగత వివరాలు ఇవ్వకూడదని పోలీసులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com