విమానాల రాకతో దుబాయ్ ఎయిర్ పోర్టుకు పాతవైభవం..

- July 07, 2020 , by Maagulf
విమానాల రాకతో దుబాయ్ ఎయిర్ పోర్టుకు పాతవైభవం..

దుబాయ్:దుబాయ్ విమానాశ్రయానికి విమానాల రాకతో పాత వైభవం దిశగా కీలక అడుగులు పడుతున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. దుబాయ్ ఎయిర్ పోర్టుకు విమానాల రాకతో దేశీయ విమానయాన రంగానికి ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. ఈ చర్యలన్ని యూఏఈని మరింత పటిష్టపరిచేందుకు దోహదం చేస్తాయని అధికారులు చెబుతున్నారు. ఆర్ధిక, వాణిజ్య కార్యకలాపాల పునరుత్తేజానికి కూడా ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. దుబాయ్ విమానాశ్రయానికి విమానాల రాకకు అనుమతి ఇవ్వటంతో పర్యాటక రంగం అభివృద్ధికి, విదేశీ పెట్టుబడుల ఆకర్షణకు బూస్టింగ్ ఇస్తుందన్నారు. ఇదిలాఉంటే..పలు దేశాల్లోని యూఏఈ ప్రవాసీయులు ఇవాల్టినుంచి దుబాయ్ విమానాశ్రయం ద్వారా దేశానికి చేరుకోనున్నట్లు డైరెక్టరేట్ స్పష్టం చేసింది. దుబాయ్ విమానాశ్రయం ద్వారా దేశానికి చేరుకుంటున్న ప్రవాసీయులు అందర్ని 'వెల్కం అగేన్ ఇన్ యువర్ సెకండ్ హోమ్' నినాదంతో స్వాగతం పలుకుతున్నట్లు వెల్లడించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com