కువైట్:ట్రాన్సాక్షన్స్ పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా తొలగించిన అంతర్గత మంత్రిత్వశాఖ

- July 07, 2020 , by Maagulf
కువైట్:ట్రాన్సాక్షన్స్ పై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా తొలగించిన అంతర్గత మంత్రిత్వశాఖ

కువైట్ సిటీ:కొందరు పౌరులు, ప్రవాసీయుల ట్రాన్సాక్షన్ పై విధించిన నిషేధాన్ని కువైట్ అంతర్గత మంత్రిత్వశాఖ తాత్కాలికంగా తొలగించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ట్రాఫిక్, మున్సిపాలిటి, వాణిజ్య మంత్రిత్వ శాఖ విభాగాలకు సంబంధించి నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన పౌరులు, ప్రవాసీయుల ట్రాన్సాక్షన్స్ ను కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ బ్లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే..ఈ నిషేధాన్ని రెండు వారాల పాటు అంటే ఈ నెల 16 వరకు తొలగించారు. ఈ రెండు వారాల్లో డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, కార్ రిజిస్ట్రేషన్స్, రెసిడెన్సీ అనుమతులకు సంబంధించి పెండింగ్ ట్రాన్సాక్షన్స్ ను పూర్తి చేసుకునే వెసులుబాటు కలిగింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com