దుబాయ్:అవినీతికి పాల్పడిన ప్రభుత్వ అధికారి అరెస్ట్
- July 07, 2020 
            దుబాయ్:అంతర్గత మంత్రిత్వ శాఖలో విధులు నిర్వహిస్తూ అవినీతికి పాల్పడిన ఓ ప్రభుత్వ అధికారిని, అతని సహచరులను యూఏఈ పోలీసులు అరెస్ట్ చేశారు. వాంటెడ్ జాబితాలో మీ పేర్లను చేరుస్తామంటూ అమాయకులను బెదిరిస్తూ వారిని బ్లాక్ మెయిల్ చేస్తున్న కేసులో గవర్నమెంట్ అధికారిని అరెస్ట్ చేసినట్లు మంత్రిత్వ శాఖ తమ ట్విట్టర్ అకౌంట్లో ట్వీట్ చేసింది. యూఏఈ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతిని ఉపేక్షించబోదని ఈ సందర్భంగా అంతర్గత మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. తమ సమాజంలో అవినీతి, మోసాలకు తావు లేదని, ముఖ్యంగా జాతికి, సమాజానికి సేవ చేసే ప్రభుత్వ సంస్థల్లో అవినీతిని అస్సలు సహించబోమని హెచ్చరించింది. ఇది తమ వ్యవస్థాగత సిద్ధాంతాలకు పూర్తిగా విరుద్ధమని వెల్లడించింది. అరెస్ట్ చేసిన ప్రభుత్వ అధికారితో పాటు అతని సహచరులను జ్యూడిషియరి అధికారులకు అప్పగించిట్లు తెలిపింది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో అందుబాటులోకి రెండు కొత్త పార్కులు..!!
- ఖతార్ లో టీన్ హబ్ యూత్ ఫెస్ట్ 2025 ప్రారంభం..!!
- యూఏఈలో నవంబర్ కు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవే..!!
- సౌదీ అరేబియా ఆదాయం SR270 బిలియన్లు..!!
- KD 170,000 విలువైన డ్రగ్స్ సీజ్.. ప్రవాసుడు అరెస్టు..!!
- మస్కట్ లో ఎయిర్ కండిషనర్ల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- 'రన్ ఫర్ యూనిటీ'లో ముఖ్య అతిథిగా పాల్గొన్న చిరంజీవి
- సీఎం రేవంత్ రెడ్డితో సల్మాన్ ఖాన్ భేటీ..
- తెలంగాణ మంత్రిగా అజారుద్దీన్ కొత్త కెరీర్..
- నెట్వర్క్ ఆస్పత్రులకు వన్‌టైం సెటిల్మెంట్ నిర్ణయం







