కువైట్:కార్మికులపై లాక్ డౌన్ ఎఫెక్ట్..జీతాల కోసం ఆందోళన
- July 08, 2020
కువైట్ సిటీ:కువైట్ లోని వివిధ రంగాల్లోని కార్మికులపై లాక్ డౌన్ తీవ్ర ప్రభావం చూపిస్తోంది. హోటళ్లు, రెస్టారెంట్లు, పలు కంపెనీలు కొన్నాళ్లుగా మూతపడటంతో ఆయా రంగాల్లోని కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కువైట్ లోని సల్మియా ప్రాంతంలో ఓ రెస్టారెంట్లో పని చేసే కార్మికులకు గత మూడు నెలలుగా జీతాలు అందటం లేదు. దీంతో ఆ గ్రూఫ్ ఆఫ్ రెస్టారెంట్లో పని చేస్తున్న దాదాపు 150 మంది కార్మికులు ఆందోళనకు దిగారు. మూడు నెలలుగా రెస్టారెంట్ మూతపడటంతో తమకు జీతాలు ఇవ్వటం లేదని, కనీసం పూట గడిచేందుకు కూడా డబ్బులు లేవని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే..రెస్టారెంట్ యాజమాన్యంతో మాట్లాడి జీతాలు ఇప్పించేలా ప్రయత్నిస్తామని సల్మానియా పోలీసులు కార్మికులను నచ్చజెప్పి ఆందోళన విరమింపజేశారు. కార్మికుల సమస్యను సాంఘిక సంక్షేమ మంత్రిత్వ శాఖకు నివేదించారు.
తాజా వార్తలు
- తెలంగాణ: బస్సులో సీటు దొరకట్లేదన్న దిగులు వద్దు..
- బ్రిటన్లో ఆరోగ్య రంగంలో నారాయణ హెల్త్ పెద్ద అడుగు!
- ఏపీకి పెట్టుబడుల వెల్లువ..
- ఎలక్ట్రిక్ యుగం వైపు ఏపీ—హిందూజా భాగస్వామ్యం!
- బస్సు ప్రమాదానికి 12 ప్రధాన కారణాలు ..
- పెట్టుబడులు సాధన లక్ష్యంగా దుబాయ్ లో పర్యటిస్తున్న మంత్రి నారాయణ
- రియాద్, తబుక్, మక్కా ప్రాంతాలలో సైరన్లు..!!
- వరల్డ్ సోషల్ డెవలప్ మెంట్ సమ్మిట్.. ట్రాఫిక్ ఆంక్షలు..!!
- ఖాసర్ అల్ హోస్న్లో జెండా ఎగురవేసిన యూఏఈ ప్రెసిడెంట్..!!
- కువైట్ లో ఇక క్యాష్ తో గోల్డ్ కొనలేరు..!!







