మస్కట్: ఎడారిలో చిక్కుకుపోయిన కుటుంబాన్ని రక్షించిన పోలీసులు

మస్కట్: ఎడారిలో చిక్కుకుపోయిన కుటుంబాన్ని రక్షించిన పోలీసులు

దక్షిణ అల్ షర్కియా గవర్నరేట్ పరిధిలో ఎడారిలో చిక్కుకుపోయిన ఓ కుటుంబాన్ని రాయల్ ఓమన్ పోలీసులు సురక్షితంగా రక్షించారు. రాయల్ ఓమన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నలుగురు కుటుంబసభ్యులు అల్ అష్కర ప్రాంతంలోని ఎడారిలో చిక్కుకుపోయారు. వారు ప్రయాణిస్తున్న వాహనం మధ్యలోనే ఆగిపోవటంతో వారు ఎడారిలో ఎటు పాలుపోని స్థితిలో సాయం కోసం ఎదురు చూస్తూ ఉండిపోయారు. అయితే..విషయం తెలుసుకున్న పోలీసులు, స్థానికుల సాయంతో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. చివరికి వారిని గుర్తించి, ఎడారి నుంచి నలుగుర్ని సురక్షితంగా రక్షించారు. 

 

Back to Top