ఖతార్ వర్సిటీ తాజా గ్రాడ్యూయేట్లకు గుడ్ న్యూస్..విద్యాశాఖలో ఉద్యోగ అవకాశాలు
- July 08, 20202020-21 అకాడమిక్ ఇయర్ లో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసే వారికి ఖతార్ ప్రభుత్వం శుభవార్త అందించింది. విద్యాశాఖలో భారీగా ఖాళీల భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఖతార్ ఉన్నత విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటన మేరకు ఫ్రెష్ గ్రాడ్యూయేట్స్ లబ్ధిపొందనున్నారు. ఖతార్ పబ్లిక్ స్కూల్స్ ని మరింత పటిష్టం చేసే లక్ష్యంతో తరగతులను పెంచటం, స్కూళ్ల సంఖ్యను పెంచాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. భవిష్యత్తులో 195 తరగతులు, 240 స్కూల్స్ అదనంగా నిర్మించాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్దేశించుకుంది. అదే సమయంలో విద్యాశాఖలో ఇటీవల కొందరు టీచర్లు రిటైర్మెంట్ అవటం, మరికొందరు రాజీనామా చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ నేపథ్యంలో పెరగనున్న స్కూళ్లు, తరగతులను దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అయితే..ప్రస్తుత ఉద్యోగ అవకాశాల్లో స్థానికులకే ప్రధాన్యం కల్పించేలా ఖతార్ వర్సిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేసిన వారినే టీచర్లుగా నియమించనున్నారు. ఇక స్పెషలైజేషన్ విభాగాల్లో మాత్రం నైపుణ్యం, అనుభవం ఉన్న వారిని రిక్రూట్ చేయాలని ఖతార్ ఉన్నత విద్యాశాఖ నిర్ణయించింది.
తాజా వార్తలు
- ఇజ్రాయెల్, ఇరాన్ వెళ్లే భారతీయులకు విదేశాంగ సూచన
- టోఫెల్ ఇండియా ఛాంపియన్షిప్ను ప్రారంభించిన ఈటిఎస్
- వాట్సప్ లో కొత్త ఫీచర్..
- 7న ప్రత్యక్షంగా కోర్టులో ఎమ్మెల్సీ కవిత ని హాజరుపరచండి
- శంషాబాద్ సమీపంలో 34 కేజీల బంగారం స్వాధీనం
- ఆడబిడ్డకు జన్మనిచ్చిన దుబాయ్ రాయల్ షేఖా మహరా
- 17 ఏళ్ల బాలుడు మిస్సింగ్ కేసు విషాదాంతం
- 123 మంది కార్మికుల పై బహిష్కరణ వేటు
- భారత ప్రవాసుల కోసం 'ఓపెన్ హౌస్'
- స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్.. 'మై చైల్డ్' యాప్ కు ప్రశంసలు